ప్రపంచ సాంస్కృతిక, వారసత్వ కేంద్రంగా కటారా..!!
- November 28, 2025
దోహా: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని ఆధ్వర్యంలో కటారా ట్రెడిషనల్ ధో ఫెస్టివల్ పదిహేనవ ఎడిషన్ 'ఫీరీజ్ కటారా'లో ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 18 వరకు కొనసాగుతుంది. ఇందులో ఖతార్, ఒమన్, కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, యూఏఈ, పాలస్తీనా, ఇండియా, ఇరాన్, టాంజానియా, ఇరాక్ మరియు సూడాన్ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు.
కటారా ట్రెడిషనల్ ధో ఫెస్టివల్ ఒక ప్రముఖ సాంస్కృతిక మరియు వారసత్వ కార్యక్రమం అని కటారా కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఖలీద్ బిన్ ఇబ్రహీం అల్ సులైతి అన్నారు. ఇది సముద్ర వారసత్వాన్ని జరుపుకోవడానికి, 12 దేశాల సామూహిక సాంప్రదాయ చేతిపనులను కాపాడుకోవడానికి కీలక వేదికగా పనిచేస్తుందని వెల్లడించారు. ఈ ఫెస్టివల్ సందర్భంగా జానపద ప్రదర్శనలు, ప్రత్యక్ష వర్క్‌షాప్ ల తోపాటు సాంప్రదాయ నౌకానిర్మాణ పద్ధతులను ప్రదర్శించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారని తెలిపారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







