NABARD రిక్రూట్‌మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…

- November 28, 2025 , by Maagulf
NABARD రిక్రూట్‌మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…

భారత దేశంలోని ప్రముఖ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ NABARD విడుదల చేసిన తాజా ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన అప్లికేషన్లకు గడువు ఎల్లుండి ముగియనున్నది. మొత్తం 91 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా, విభాగానుసారం వివిధ అర్హతలతో ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ నియామకాల్లో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, MBA/PGDM, CA/CS/CMA/ICWA, PhD, BBA, BMS, BE, B.Tech, అలాగే LLB/LLM పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ప్రతీ పోస్టుకు అవసరమైన ప్రత్యేక అర్హతలు అధికారిక నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొనబడ్డాయి.

ఎంపిక విధానం & పరీక్షా తేదీలు
NABARD ఈ నియామక ప్రక్రియను మూడు దశల్లో నిర్వహిస్తోంది:

  • ప్రిలిమినరీ ఎగ్జామ్
  • నిర్వహణ తేదీ: డిసెంబర్ 20
  • మెయిన్స్ ఎగ్జామ్
  • నిర్వహణ తేదీ: జనవరి 25
  • సైకోమెట్రిక్ టెస్ట్
  • మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు.

ఈ మూడు దశలలో అభ్యర్థుల ప్రదర్శన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మోడల్ పేపర్లు, గత పరీక్షల ప్రశ్నపత్రాలను NABARD అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

SC/ST/OBC/PWBD అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ

NABARD Jobs: ప్రతిభ ఉన్నప్పటికీ, పోటీ పరీక్షలకు సరైన దిశానిర్దేశం పొందలేని అభ్యర్థులను ప్రోత్సహించేందుకు NABARD ప్రి రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ నిర్వహిస్తోంది.

ట్రైనింగ్ తేదీలు: డిసెంబర్ 8 – డిసెంబర్ 19
అర్హత ఉన్న వర్గాలు: SC, ST, OBC, PWBD
ఈ శిక్షణలో ప్రిలిమ్స్ పరీక్షకు కావలసిన మౌలిక అంశాలు, ప్రశ్నల నమూనా, పరీక్ష రాసే పద్ధతులు వంటి ముఖ్య అంశాలను నేర్పిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com