2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

- November 28, 2025 , by Maagulf
2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక సెలవుల జాబితాను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో అమలయ్యేలా జనరల్ హాలిడేస్ మరియు ఆప్షనల్ హాలిడేస్‌ను విడుదల చేసింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా ఉద్యోగులు, ప్రజా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర చట్టసభ సంస్థలు పాటించాల్సిన స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం తెలియజేసింది.

ఈ జాబితాలో 14 ప్రధాన సెలవులు తప్పనిసరిగా పాటించాల్సివుంటాయి.ఇవి దేశవ్యాప్తంగా ఒకేసారి అమలులోకి వస్తాయి. జాతీయ ఉత్సవాలు, మతపరమైన పండుగలు, ముఖ్య ఆధ్యాత్మిక సందర్భాలు—అన్నిఈ క్యాలెండర్‌లో భాగమయ్యాయి.స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి వంటి జాతీయ దినోత్సవాలతో పాటు బుద్ధ పౌర్ణిమ, దీపావళి, దసరా, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ వంటి పండుగలకు కూడా సెలవులు ఉండనున్నాయి.

12 ఆప్షనల్ హాలిడేస్—ఉద్యోగులు తమ అభిరుచితో ఎంచుకోవచ్చు
జనరల్ హాలిడేస్‌తో పాటు కేంద్రం 12 ఆప్షనల్ హాలిడేస్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఇవి పూర్తిగా వ్యక్తిగత అవసరం, మతపరమైన విశ్వాసాలు, ప్రాంతీయ ఆచారాల ఆధారంగా ఎంచుకునే వీలున్న సెలవులు. దేశంలో అనేక మతాలు, భాషలు, ఆచారాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి అవసరాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం అమలులో ఉందని కేంద్రం తెలిపింది. ఈ ఆప్షనల్ హాలిడేస్‌ను ఉద్యోగులు ప్రతీ సంవత్సరం నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఎంచుకోవచ్చు. సంస్థల పనితీరుకు ఆటంకం కలగకుండా సెలవుల వాడకం ఎలా ఉండాలో కూడా మార్గదర్శకాలు జారీ చేశారు. అన్ని సంస్థలు ఈ జాబితాను తమ అధికారిక క్యాలెండర్లలో చేర్చుకోవాల్సి ఉంటుంది.మొత్తం మీద, కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా ప్రజా పరిపాలనలో పారదర్శకతను, స్పష్టతను తీసుకురావడమే కాకుండా ఉద్యోగుల వ్యక్తిగత, సాంస్కృతిక అవసరాలకు కూడా సంతులనం కల్పిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com