సెనగపిండిని తో జిడ్డుకారే సమస్య అదుపులోకి...
- July 25, 2016
కాలేజీలు, ఉద్యోగాలు అంటూ బయటతిరిగే అమ్మాయిలకు ప్రధాన సమస్య ముఖంపై టాన్ పేరుకోవడం. దీనికి ఖరీదైన ఉత్పత్తులు ఎంచుకోవాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉండే సెనగపిండితోనూ ప్రయత్నించి ఫలితం పొందవచ్చు. అది ఎలా అంటే! ము ఖంపై పేరుకున్న నలుపుదనం పోవాలంటే పాలల్లో కాస్త సెనగపిండి, చెంచా తేనె చేర్చి ముఖానికి రాసుకోవాలి. కాసేపాగి పాలతో చేతులు తడుపుకుంటూ మృదువుగా రుద్దాలి. ఇలా రోజూ చేస్తుంటే చర్మం కాంతిమంతంగా మారుతుంది. నలుపూ తగ్గుతుంది.
*
కొందరి ముఖం ఇట్టే జిడ్డు కారుతుంది. ఇలాంటివారు సెనగపిండికి కాస్త గులాబీ నీరు, పెరుగు చేర్చి బాగా కలుపుకోవాలి. దీన్ని రోజూ ఉదయాన్నే ముఖానికి పూతలా వేస్తే జిడ్డుకారే సమస్య అదుపులోకి వస్తుంది.
*
సెనగపిండిని పాలతో మెత్తని పేస్ట్‌లా చేసుకున్నాక దానికి అరకప్పు పంచదార చేర్చాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని మృదువుగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి దూరమవుతుంది. మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.
*
కొందరికి మోచేతులు, మెడ దగ్గర నల్లగా తయారవుతుంది. ఇలాంటివారు సెనగపిండిలో తగినంత నిమ్మరసం, మూడు చెంచాల పంచదార కలిపి ఆ ప్రదేశాల్లో రాసుకుని రుద్దాలి. ఇలా కనీసం వారంలో రెండు సార్లు చేస్తుంటే క్రమంగా సమస్య దూరమవుతుంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









