డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. UPS నుంచి LPG వరకు రాబోయే మార్పులివే..
- November 29, 2025
న్యూ ఢిల్లీ: డిసెంబర్ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ప్రత్యేకించి ఆర్థిక నిబంధనలకు సంబంధించి అనేక మార్పులు వచ్చే నెలలో అమల్లోకి రానున్నాయి. రాబోయే ఈ కొత్త మార్పులతో మీ సేవింగ్స్ ఖర్చులపై ప్రత్యక్షంగా ప్రభావితం చేయనున్నాయి.
పెన్షన్ డాక్యుమెంట్లు, పన్ను ప్రకటనలు (Dec New Rules 2025) వంటి ముఖ్యమైన పనులను నవంబర్ 30 నాటికి పూర్తి చేయాలి. ఆ తర్వాత, డిసెంబర్ 1 నుంచి పన్నులు, పెన్షన్లు, ఇంధన ఖర్చులకు సంబంధించిన అప్‌డేట్ చేసిన రూల్స్ వర్తించనున్నాయి. డిసెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చే ఆర్థిక నిబంధనల ప్రధాన మార్పులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
యూపీఎస్ (UPS)కి డెడ్‌లైన్:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)లో చేరడానికి చివరి తేదీ నవంబర్ 30. ఒక ఉద్యోగి NPS నుంచి UPSకి మారాలనుకుంటే వారు CRA పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ప్రక్రియను పూర్తి చేయాలి లేదా వారి శాఖ నోడల్ అధికారికి ఒక ఫారమ్‌ను సమర్పించాలి. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి మార్పులు చేసిన చెల్లదు.
పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్:
పెన్షనర్లందరూ నవంబర్ 30వ తేదీలోపు తమ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. పెన్షనర్ బతికే ఉన్నారో లేదో ప్రభుత్వం ధృవీకరించుకునేందుకు వీలు కల్పిస్తుంది. చాలా మంది ఇప్పుడు జీవన్ ప్రమాణ్ (డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్) ఉపయోగిస్తున్నారు. దీనిని బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా కూడా సమర్పించవచ్చు. సకాలంలో సర్టిఫికేట్ సమర్పించకపోతే మళ్ళీ సర్టిఫికేట్ సమర్పించే వరకు పెన్షన్ నిలిచిపోతుంది.
TDS సంబంధిత ఫైలింగ్:
నవంబర్ 30వ తేదీ నాటికి పన్ను చెల్లింపుదారులు కొన్ని ముఖ్యమైన టీడీఎస్ సంబంధిత సమాచారాన్ని సమర్పించాలి. అక్టోబర్‌లో చేసిన TDS స్టేట్‌మెంట్‌లు, సెక్షన్ 194-IA, సెక్షన్ 194-IB, సెక్షన్ 194M, సెక్షన్ 194S వంటివి ఇందులో ఉన్నాయి.
అదనంగా, ట్రాన్స్‌ఫర్ ధరల రిపోర్టులను (సెక్షన్ 92E) దాఖలు చేయాల్సిన కంపెనీలు కూడా నవంబర్ 30వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. భారతీయ అనుబంధ సంస్థలను నిర్వహించే మల్టీ నేషనల్ గ్రూపు కంపెనీలు నవంబర్ 30వ తేదీ నాటికి ఫారమ్ 3CEAAను సమర్పించాలి. గడువు దాటితే భారీగా జరిమానాలతో నోటీసులు అందుకోవచ్చు.
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలు:
డిసెంబర్ 1న చమురు కంపెనీలు కొత్త LPG సిలిండర్ ధరలను విడుదల చేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ డాలర్ రేట్ల ఆధారంగా ధరలు నెలవారీగా సవరిస్తారు. గత ఏడాదిలో కమర్షియల్ సిలిండర్ ధరలు కొద్దిగా తగ్గాయి. డిసెంబర్ 1న దేశీయ గ్యాస్ చౌకగా మారుతుందా లేదా ఖరీదైనదిగా మారుతుందా అనేది వేచి చూడాల్సిందే.
విమాన ఇంధన (ATF) ధరలు:
డిసెంబర్‌లో విమాన ప్రయాణాలకు రెడీ అవుతున్నారా? డిసెంబర్ 1న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు కూడా మారుతాయి. ఈ ఇంధన ధరల పెంపు లేదా తగ్గింపు విమానయాన సంస్థల ఖర్చులపై ప్రభావితం చేస్తుంది. దాంతో విమాన ఛార్జీలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.
ITR డెడ్‌లైన్: ఆడిట్ అవసరం లేని టాక్స్‌పేయర్లకు ఐటీ రిటర్న్స్ గడువు సెప్టెంబర్ 16తోనే ముగిసింది. ఆడిట్ అవసరం ఉన్న టాక్స్ పేయర్లకు ఐటీ రిటర్న్స్ దాఖలుకు డిసెంబర్ 10 వరకు గడువు ఉంది. ఆ తేదీ దాటితే భారీగా పెనాల్టీ పడే అవకాశం ఉంది.
బిలేటెడ్ IT రిటర్న్స్: అసలు డెడ్‌లైన్ గడువు ముగిసిన తర్వాత బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు విధించారు. అయితే, జరిమానా చెల్లించక తప్పదు.
పాన్- ఆధార్ లింక్ : పాన్ ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. 2024 అక్టోబర్ 1 ముందు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీతో పాన్ కార్డును పొందితే ఇప్పుడు కచ్చితంగా ఆధార్ కార్డుతో పాన్ లింక్ చేసుకోవాలి. డిసెంబర్ 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఆ తర్వాత మీ పాన్ కార్డు చెల్లదు.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







