గోదావరి పుష్కరాలకు ముహుర్తం ఖరారు!
- November 30, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ గోదావరి పుష్కరాలకు సంబంధించి అధికారిక నివేదికను ప్రభుత్వానికి పంపి, 2027లో పుష్కరాలను జూన్ 26 నుండి జులై 7 వరకు నిర్వహించాలని ముహుర్తం ఖరారు చేసింది. ఈ పుష్కరాలకు 7–8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పుష్కరాల నిర్వహణకు రూ.5,704 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు కూడా సిద్ధం అయ్యాయి.
రైల్వే ప్రత్యేక సేవలు
పుష్కరాల ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల కమిటీ, వివిధ శాఖల కార్యదర్శులు, ఆగమ, వైదిక పండితులు పుష్కరాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భక్తుల రద్దీ నియంత్రణ, స్నాన ఘాట్ల నిర్వహణ, రైల్వే ప్రత్యేక సేవలు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.
పూర్వపు పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు కనీసం రెండు రోజుల పాటు జిల్లాల్లో ఉండేలా, ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లేలా సమన్వయం చేపడతామని అధికారులు తెలిపారు. నిడవదోలు, గోదావరి, కొవ్వూరు స్టేషన్లలో రద్దీ తగినంతగా నిర్వహించడానికి వసతులు ఏర్పాటు చేయనున్నట్లు కూడా చెప్పారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







