తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం..
- November 30, 2025
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు అనునిత్యం ప్రయత్నాలు చేస్తున్న టీజీఎస్ఆర్టీసీ..మరో ఆలోచనతో ప్రయాణికుల ముందుకొచ్చింది. ఇకపై బస్సు ప్రయాణానికి 60రోజుల ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
60 రోజుల ముందస్తు బుకింగ్ సదుపాయం గతంలోనూ అందుబాటులో ఉంది.అయితే, దీనిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో పండుగల సీజన్ నేపథ్యంలో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా పండుగలు, సెలవుల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలు వేసుకునేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు, తద్వారా వారికి మరింత చేరువయ్యేందుకు టీజీఎస్ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలో ప్రయాణికులను ఆకర్షించేలా సరికొత్త స్కీంలను సైతం అందుబాటులోకి తీసుకొస్తుంది.ఇందులో భాగంగా దసరా, దీపావళి పండుగల సమయంలో లక్కీడ్రాను సైతం నిర్వహించింది. అంతేకాక..ప్రయాణికుల కోసం ‘గమ్యం’ యాప్ ద్వారా బస్సుల లైవ్ లొకేషన్ తెలుసుకునే సదుపాయం కల్పించింది. పలు ప్రాంతాలకు ఏసీ, సీటర్, స్లీపర్ సర్వీసులను టీజీఎస్ ఆర్టీసీ తీసుకొచ్చింది. విమాన ప్రయాణం మాదిరే బస్సు సర్వీసు, ప్రయాణ సమయం, స్టాపుల వివరాలను బస్సు ప్రయాణం ప్రారంభానికి ముందే వివరిస్తారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







