తెలంగాణలో మరో రైల్వేలైన్‌కు గ్రీన్‌సిగ్నల్..
- November 30, 2025
హైదరాబాద్: తెలంగాణలో 10 ఏళ్ల తరువాత నూతన రైల్వే లైన్‌కు గ్రీన్‌సిగ్నల్ అందింది. దాదాపు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామగుండం–మణుగూరు రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ నుండి సూత్రప్రాయ ఆమోదం లభించింది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలింది. సుమారు 4,000 కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే మార్గం నిర్మించనున్నారు.
ఈ కొత్త రైల్వే లైన్...
- సింగరేణి కార్మికులు, భక్తులు, స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందిస్తుంది.
- బొగ్గు రవాణాను వేగవంతం చేసి, విద్యుత్ కేంద్రాలు, పరిశ్రమలకు లాభం కల్పిస్తుంది.
- సమ్మక్క-సారక్క జాతరకు వెళ్ళే వేలాది భక్తులకు ప్రత్యేక కనెక్టివిటీ ఇస్తుంది.
- రైల్వే మార్గం రోడ్లు, జాతీయ రహదారి NH-63, ప్రాంతీయ రవాణా వ్యవస్థలతో సమన్వయం అవుతుంది.
ఎంపీ వంశీకృష్ణ తెలిపారు, ఈ ప్రాజెక్ట్ పెద్దపల్లి మరియు మంచిర్యాల ప్రాంతాల మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. స్థానిక ప్రజలు, కార్మికులు, భక్తుల ప్రయాణ సౌకర్యం, వ్యయ మరియు సమయాన్ని తగ్గించడానికి ఇది చారిత్రక ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







