హైదరాబాద్‌లో కొత్త AI సెంటర్‌తో 3,000 ఉద్యోగాలు..

- December 01, 2025 , by Maagulf
హైదరాబాద్‌లో కొత్త AI సెంటర్‌తో 3,000 ఉద్యోగాలు..

హైదరాబాద్: హైదరాబాద్‌ను టెక్నాలజీ హబ్‌గానే కాకుండా ప్రపంచ భద్రత, బాధ్యతాయుతమైన ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.కోవాసెంట్ సంస్థ తాజా AI ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభంతో నగరం ‘గ్లోబల్ AI కమాండ్ సెంటర్’గా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రారంభ దశలో 500 మంది ఇంజనీర్లతో ప్రారంభమవుతున్న ఈ సెంటర్, 2028 నాటికి 3,000 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

తెలంగాణ రాజధాని ప్రస్తుతం కేవలం టెక్ సిటీ కాదు, భవిష్యత్‌కు దారితీసే AI పరిష్కారాల అభివృద్ధి కేంద్రంగా గుర్తింపుకుంటోంది. కోవాసెంట్ కొత్త AI ఇన్నోవేషన్ సెంటర్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రపంచ మార్కెట్‌కు అవసరమైన అడ్వాన్స్‌డ్ AI ఉత్పత్తులు, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లు, ఎడ్జ్ టెక్నాలజీలను అభివృద్ధి చేసే కేంద్రంగా ఇది నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ AI రంగంలో స్థిరమైన నాయకత్వం కోసం దీర్ఘకాల వ్యూహంతో ముందుకు సాగుతున్నదని తెలిపారు.

భవిష్యత్‌లో AI, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్‌డ్ ఇంజనీరింగ్ విభాగాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషించనున్నదని ఐటీ శాఖ వెల్లడించింది. కోవాసెంట్ AI సెంటర్ స్థాపనతో ప్రభుత్వ పాలన, పౌర భద్రత, డిజిటల్ సర్వీసుల్లో AI వినియోగం వేగవంతం కానుందని పేర్కొన్నారు. ఈ కొత్త కేంద్రం ద్వారా హైదరాబాద్ ప్రపంచ AI పటంలో అత్యంత ప్రభావశీల నగరంగా ఎదగనుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com