లోక్‌సభలో పలు బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్
- December 01, 2025
న్యూ ఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. లోక్‌సభలో ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పలు బిల్లులను ప్రవేశపెట్టారు. 2025 సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. 1944 నాటి సెంట్రల్ ఎక్సైజ్ బిల్లును సవరించనున్నట్లు మంత్రి వెల్లడించారు.హెల్త్ సెక్యూర్టీ, నేషనల్ సెక్యూర్టీ సెస్ బిల్లును కూడా మంత్రి ప్రవేశపెట్టారు. జాతీయ భద్రత, ప్రజా ఆరోగ్యం కోసం నిధులను పెంచాలని కోరుతూ బిల్లును రూపొందించారు.మణిపూర్‌కు చెందిన జీఎస్టీ సవరణ బిల్లును కూడా మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు.
మరో వైపు సిర్‌పై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. సభ జరుగుతున్న సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు.కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను నిలిపివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణ కోసం కొన్ని రాష్ట్రాల్లో సిర్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- ‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!
- కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!
- లోక్‌సభలో పలు బిల్లులను ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్‌లో కొత్త AI సెంటర్‌తో 3,000 ఉద్యోగాలు..
- పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: కొల్లు రవీంద్ర







