ఖతార్ లో నబాక్ పార్క్, అథల్ పార్క్‌లు ప్రారంభం..!!

- December 02, 2025 , by Maagulf
ఖతార్ లో నబాక్ పార్క్, అథల్ పార్క్‌లు ప్రారంభం..!!

దోహా: ఖతార్ లో మరో రెండు పార్కులు అందుబాటులోకి వచ్చాయి. అల్ తుమామాలోని నబాక్ పార్క్ మరియు అల్ మిరాద్‌లోని అథల్ పార్క్‌లను ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ పార్కులను అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) అభివృద్ధి చేసింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జనరల్ సర్వీసెస్ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అబ్దుల్లా అహ్మద్ అల్-కర్రానీ, మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ వర్క్స్ అథారిటీ లకుచెందిన అనేక మంది అధికారులు పాల్గొన్నారు.
ఖతార్ నేషనల్ విజన్ 2030కి అనుగుణంగా జీవన నాణ్యతను పెంచడం, పచ్చని ప్రదేశాలను విస్తరించడం మరియు   అభివృద్ధి ప్రణాళికలలో పార్కుల ప్రారంభం ఒకటని ఇంజినీర్ అబ్దుల్లా అహ్మద్ అల్-కర్రానీ పేర్కొన్నారు. ఈ కొత్త పార్కుల ప్రారంభోత్సవం మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ 2024–2030 ప్రణాళిక, మూడవ జాతీయ అభివృద్ధి వ్యూహం 2030 అమలుకు అనుగుణంగా ఉందని  తెలిపారు. ఇవి పట్టణ పర్యావరణ నాణ్యతను పెంపొందించడానికి దోహదం చేస్తుందన్నారు.  

అల్ తుమామాలోని నబాక్ పార్క్ మొత్తం 3,723 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ పార్క్‌లో 181 మీటర్ల జాగింగ్ ట్రాక్, 6–12 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం, ఫిట్‌నెస్ జోన్, సీటింగ్ ప్రాంతాలు, విశ్రాంతి గదులు ఉన్నాయి. ఇక అల్ మిరాద్‌లోని అథల్ పార్క్ 3,368 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.192 మీటర్ల జాగింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలాలు, 776 చదరపు మీటర్ల మార్గాలు, సీటింగ్ ప్రాంతాలు,రెస్ట్‌రూమ్‌లు ఉన్నాయని వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com