ఒమన్ లో రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభం..!!

- December 02, 2025 , by Maagulf
ఒమన్ లో రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభం..!!

మస్కట్: ఒమన్ సంస్కృతి, క్రీడల శాఖల మంత్రి సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సైద్ రెండు పట్టణ అభివృద్ధి కార్యక్రమాలైన "యమల్" మరియు "జూద్" ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. తలాత్ మౌస్తఫా గ్రూప్ (TMG) నేతృత్వంలో RO 1.7 బిలియన్ల సంయుక్త పెట్టుబడితో ఈ వెంచర్లను సుల్తాన్ హైతం.. అల్ మనుమా తీరప్రాంతంలో చేపడుతున్నారు.  ఈ రెండు ప్రాజెక్టులు ఒమన్ విజన్ 2040 లక్ష్యాలను సాకారం చేస్తాయని పేర్కొన్నారు.   

"జూద్" ప్రాజెక్ట్ 2.7 మిలియన్ చదరపు మీటర్ల స్మార్ట్ సిటీగా నిర్మిస్తున్నారు. ఇందులో 7,000 కంటే ఎక్కువ విభిన్న నివాస యూనిట్లు ఉంటాయని తెలిపారు. ఇందులో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.   

ఇక  "యమల్" ప్రాజెక్ట్ ఒమన్ సముద్రం వెంబడి ఆకట్టుకునే 1,760 మీటర్ల వాటర్‌ఫ్రంట్‌తో 2.2 మిలియన్ చదరపు మీటర్ల ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రధాన తీరప్రాంత గమ్యస్థానం అంతర్జాతీయ మెరీనా, ప్రపంచ స్థాయి హోటల్స్,  సముద్ర కార్యకలాపాలకు నిలయంగా ఉంటుంది. దీనిద్వారా 6,000 కంటే ఎక్కువ నివాస మరియు ఆతిథ్య యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ప్రీమియం పెట్టుబడులకు, ఆకర్షణీయమైన మార్కెట్‌ కు కేంద్రంగా ఒమన్ ను నిలుపుతుందని వెల్లడించారు.     

ఇటీవల ఒమన్ సుల్తానేట్ కీలక ఆర్థిక మరియు పెట్టుబడి సూచికలలో అద్భుతమైన పురోగతిని నమోదు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) 2025 మొదటి త్రైమాసికంలో 22 మరియు 23 శాతం మధ్య బలమైన వృద్ధిని నమోదు చేసింది.  ఒమన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 9.2 శాతం వృద్ధితో దూసుకుపోతుంది. పలు అంతర్జాతీయ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో రానున్నాయి.  ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయని అధికార యంత్రాంగం వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com