దుబాయ్ లో స్కామ్ సూత్రధారి భారత్ లో అరెస్టు..!!
- December 02, 2025
యూఏఈ: దుబాయ్‌కు చెందిన బ్లూచిప్ గ్రూప్ యజమాని, యూఏఈలో అతిపెద్ద ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్ కు పాల్పడి పారిపోయిన రవీంద్ర నాథ్ సోని భారత్ లో అరెస్టు చేశారు. దాదాపు 18 నెలలగా అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. నవంబర్ 30న ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుండి అదుపులోకి తీసుకున్నట్లు కాన్పూర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అంజలి విశ్వకర్మ వెల్లడించారు. అంతకుముందు అతని అచూకీ తెలిపిన వారికి 10వేల రూపాయల రివార్డును ప్రకటించారు.
సోని తన దుబాయ్‌కు చెందిన బ్లూచిప్ కంపెనీ ద్వారా అధిక నెలవారీ ఆదాయాన్ని హామీ ఇచ్చి అనేక మంది బాధితులను మోసం చేశాడు. అతనిపై గతంలో మూడు ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. అతనికి సుదీర్ఘ నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.
దుబాయ్ లో సోనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఒక చెక్-హోల్డర్‌కు 10.05 మిలియన్ దిర్హామ్‌లు తిరిగి చెల్లించడంలో ఫెయిల్ అయినందుకు దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
బుర్ దుబాయ్‌లోని అల్ జవాహారా బిల్డింగ్ నుండి పనిచేసిన అతని బ్లూచిప్ కంపెనీ, పెట్టుబడిదారులకు 18 నెలల పాటు కనీసం 10వేల డాలర్ల పెట్టుబడిపై 3% నెలవారీ రాబడిని హామీ ఇచ్చింది. మార్చి 2024లో ఈ కంపెనీ బోర్డు ఎత్తేసింది. దీంట్లో పెట్టుబడులు పెట్టిన బాధితులు సుమారు 367 మిలియన్ల దిర్హమ్స్ వరకు నష్టపోయారు. వీరిలో అత్యధికులు భారతీయ ప్రవాసులు ఉన్నారు.
అంతకుముందు కూడా సోనీ బుర్ దుబాయ్ ప్రాంగణం నుండి Acme మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ మరియు Acme గ్లోబల్ జనరల్ ట్రేడింగ్‌ను నిర్వహించాడు. ఇవి కూడా పెట్టుబడిదారుల నిధులను దోచుకున్న తర్వాత కంపెనీలను మూసివేశాడు. అలాగే, భారత్ లో 2022లో అలీఘర్‌లో "డబుల్-యువర్-మనీ" పథకాన్ని ప్రారంభించి పలువురిని మోసం చేసిన కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతనిపై హర్యానాలోనూ మోసాలు, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
కాగా, మే 2024లో అతడి బ్లూచిప్ సంస్థ మూతపడటానికి కొన్ని రోజుల ముందు దాదాపు 41 మిలియన్ డాలర్లను తెలియని క్రిప్టోకరెన్సీ వాలెట్‌కు బదిలీ చేసినట్లు విచారణలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అతడి అరెస్టు తమకు సంతోషాన్ని ఇచ్చిందని, అయితే తమ డబ్బులు తిరిగి పొందే వరకు తమ పోరాటం ఆగదని పలువురు బాధితులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్..!!







