తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
- December 03, 2025
హైదరాబాద్: తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చలి వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.రాష్ట్రంలో చురుగ్గా వీస్తున్న ఈశాన్య గాలుల కారణంగానే చలి తీవ్రత మరింత పెరిగింది.వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీలకు పడిపోయింది.
ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. హెచ్‌సీయూ, బీహెచ్‌ఈఎల్ ప్రాంతాల్లో 8.8 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 9.4, మౌలాలీలో 9.6, శివరాంపల్లిలో 10.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి.రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత పెరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డ్ సార్థక్..!!
- తెలంగాణ సమిట్కు ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం రేవంత్
- ఏపీ: ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం







