కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- February 08, 2026
కువైట్: కువైట్ లో ప్రజారోగ్యం మరియు ఆహార భద్రతా ప్రమాణాలపై పెరుగుతున్న ఆందోళనల మధ్య అనధికార ఫుడ్ సెల్లర్స్ ను నియంత్రించడానికి కఠినంగా వ్యవహారించనున్నట్లు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక తనికఖీలను ప్రారంభించినట్లు పేర్కొంది. లైసెన్స్ లేని ఫుడ్ అమ్మకాలను ప్రోత్సహించే ప్రకటనలను ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను పర్యవేక్షిస్తామన్నారు.
అలాగే, హోం ఆధారిత ఫుడ్ సెల్లర్స్ పై పర్యవేక్షణను ప్రారంభించినట్లు తెలిపింది. ఫుడ్ సెల్లర్స్ అవసరమైన లైసెన్సులను సంబంధిత అథారిటీల నుంచి తప్పనిసరిగా పొందాలని, లేదంటే ఉల్లంఘనల తీవ్రతను బట్టి భారీ జరిమానాలు, జైలు శిక్ష లేదా రెండూ ఉండవచ్చని మంత్రిత్వశాఖ హెచ్చరించింది. హోం ఆధారిత ఫుడ్ సెల్లర్స్ అవసరమైన లైసెన్స్‌లను పొందడం ద్వారా వారి కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







