గాజాలో సామూహిక వివాహాలు

- December 03, 2025 , by Maagulf
గాజాలో సామూహిక వివాహాలు

గాజాలో రెండేళ్ల పాటు బాంబ్ దాడులతో దద్దరిల్లింది. భీకర దాడులతో గాజా కకావికలం అయింది.ఇటీవల గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరగడంతో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది.దీంతో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన జంటలన్నీ ఒకేసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. మంగళవారం పెద్ద ఎత్తున సామూహిక వివాహాలు జరిగాయి. దీంతో గాజాలో సందడి వాతావరణం నెలకొంది.గాజాలో మంగళవారం 54 జంటలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాయి. గాజాలోని ఖాన్ యూనిస్‌లోని హమద్ నగర్‌లో జరిగిన వేడుకలో 54 పాలస్తీనా జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుక సందడి.. సందడిగా సాగింది. గాజాలో 2 మిలియన్ల మంది నివాసం ఉంటున్నారు. యుద్ధం కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ జరిపిన బాంబ్ దాడులతో భవనాలు నేలమట్టం అయ్యాయి. యుద్ధ సమయంలో బంధువుల ఇళ్లకు వెళ్లి తలదాచుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉండడంతో తిరిగి ఇళ్లకు వచ్చి వివాహాలు చేసుకుంటున్నారు. ఇక, ఈ పెళ్లిలో పాలస్తీనాకు చెందిన ఎమన్‌ హసన్‌ లావా, హిక్మత్‌లు కూడా ఒక్కటయ్యారు. యుద్ధం నేపథ్యంలో వీరు వేరే పట్టణంలో తల దాచుకున్నారు. ఆశ్రయం, ఆహారం కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. ఘర్షణల్లో తమ కుటుంబాలను కోల్పోవడంపై ఈ జంట ఆవేదన వ్యక్తంచేసింది. ‘ఒక సాధారణ వ్యక్తిలా ఇల్లు, ఉద్యోగం, భార్యాపిల్లలతో కలిసి ఉండాలని నేను కలలు కన్నాను. యుద్ధంలో అన్నింటినీ కోల్పోయాం. ఇప్పడు జీవితాన్ని తిరిగి ప్రారంభించాలి. అయితే, అది మేము అనుకున్నట్లు ఉండదు’ అని హిక్మత్‌ అన్నారు. యుద్ధం వల్ల గాజాలో 2 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయెల్ దాడులతో నగరాలు మొత్తం నేలమట్టమయ్యాయి. ఈ ప్రాంతంలో మానవతా సాయం కొరత ఇంకా ఉండటం గమనార్హం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com