టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల
- December 03, 2025
రాయ్‌పూర్: రాబోయే సంవత్సరం జరగనున్న టీ20 ప్రపంచకప్, సందర్భంగా బీసీసీఐ బుధవారం కొత్త జెర్సీని విడుదల చేసింది.దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రచారకర్త రోహిత్ శర్మ టీమిండియా కొత్త జెర్సీని ఆవిష్కరించారు.
టీమిండియా రైజింగ్ స్టార్ తిలక్ వర్మ, బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, సంయుక్త కార్యదర్శి ప్రభతేజ్ సింగ్ భాటియా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొన్నారు.రాయ్‌పూర్‌కు చెందిన దాదాపు వంద మందికిపైగా విద్యార్థులను ఆహ్వానించారు. ఐసీసీ మెగా ఈవెంట్ కోసం సిద్ధం చేసిన భారత జెర్సీ లైఫ్ సైజ్ మోడల్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారత జట్టుకు ఎల్లప్పుడు నా శుభాకాంక్షలు ఉంటాయి.ప్రతి ఒక్కరూ భారత జట్టుకు మద్దతు ఇస్తారు.జట్టు కప్‌ను గెలిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నాను’ రోహిత్ చెప్పాడు. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 ప్రపంచకప్ 2026 పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







