విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- March 10, 2026
అమెరికా, ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న ఘర్షణల మధ్య ఇరాన్ ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. విదేశాల్లో నివసిస్తున్న ఇరాన్ పౌరులు దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తే లేదా శత్రు దేశాలకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
శత్రు దేశాలకు సహకరిస్తే దేశద్రోహం
ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, విదేశాల్లో ఉంటూ అమెరికా లేదా ఇజ్రాయెల్‌తో కలిసి పనిచేసే వారిని దేశద్రోహులుగా పరిగణిస్తామని తెలిపింది. గూఢచారి కార్యకలాపాలు లేదా ఇరాన్ భద్రతకు ముప్పు కలిగించే చర్యలు చేపడితే మరణశిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు స్వాధీనం
ఇరాన్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు తేలితే, ఆ వ్యక్తులపై కఠిన చర్యలతో పాటు వారి ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మానవ హక్కుల సంస్థల విమర్శలు
ఇరాన్‌లో పెరుగుతున్న నిరసనలకు విదేశాల్లో ఉన్న ఇరానీయులు సోషల్ మీడియా ద్వారా మద్దతు ఇస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్యలను ఐక్యరాజ్యసమితి (UN), అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి మానవ హక్కుల సంస్థలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
ఇప్పటికే ఇరాన్ జైళ్లలో ఉన్న కొంతమంది నిరసనకారులకు సరైన విచారణ లేకుండానే మరణశిక్షలు అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో డ్యూయల్ సిటిజన్‌షిప్ కలిగిన ఇరానీయుల్లో ఆందోళన నెలకొంది.
తాజా వార్తలు
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!
- కువైట్‌లో వీధి కుక్కలు..ఇంటిరీయర్ మినిస్ట్రీ కీలక సూచనలు..!!
- ఖతార్‌లో విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్..!!
- దుబాయ్‌లో ఉద్యోగం మారుతున్నారా.. నాన్ కంపీట్ క్లాజ్ తెలుసా?
- బౌషర్‌లో ఇంటి నుంచి ఏసీ యూనిట్ల చోరీ..!!
- సౌదీలో భారీ వర్షాలు..తూర్పు ప్రావిన్స్‌లో రెడ్ ఫాగ్ అలర్ట్..!!
- తెలంగాణ టూరిజానికి డిజిటల్ బూస్ట్..
- ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్..







