ఆగస్టు 9న 16 ఏళ్ల దీక్షను విరమించనున్న షర్మిల

- July 26, 2016 , by Maagulf
ఆగస్టు 9న 16 ఏళ్ల దీక్షను విరమించనున్న షర్మిల

 ప్రఖ్యాత హక్కుల ఉద్యమకారిణి ఇరోం షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన 16ఏళ్ల నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 9న ఆమె దీక్షకు ముగింపు పలకనున్నారు. మంగళవారం ఇంఫాల్‌లోని కోర్టు బయట విలేకరులతో మాట్లాడుతూ .. ఇక దీక్షకు స్వస్తి పలికి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. ఇరోం షర్మిల స్వరాష్ట్రం మణిపూర్‌ సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్మీ దళాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని ఆమె గత 16ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ముక్కుకు అమర్చిన పైపు ద్వారా ఎక్కిస్తున్న ద్రావణాలతోనే జీవిస్తున్నారు. .'ఐరన్‌ లేడీ'గా పిలిచే షర్మిల 2000 నవంబరులో దీక్ష ప్రారంభించారు. ఇంఫాల్‌ విమానాశ్రయానికి సమీపంలో మాలోమ్‌ వద్ద బస్‌స్టాప్‌లో నిలబడి ఉన్న పది మందిని అస్సాం రైఫిల్స్‌ సైనికులు కాల్చి చంపడంపై వ్యతిరేకతతో ప్రారంభమైన ఆమె దీక్ష ఇన్నేళ్లుగా పట్టువదలకుండా సాగించారు. ఇన్నేళ్లయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటీవల సుప్రీంకోర్టు కూడా మణిపూర్‌ ఆర్మీకి ప్రత్యేక హక్కుల చట్టాన్ని వ్యతిరేకించింది. అక్కడి ఆర్మీకి ప్రత్యేక హక్కులు అవసరం లేదని పేర్కొంది. అక్కడ జరిగిన నకిలీ ఎన్‌కౌంటర్లపై విచారణ జరపాలని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com