సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!

- December 06, 2025 , by Maagulf
సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!

మస్కట్: సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం (SQU) లో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు.  36వ బ్యాచ్ గ్రాడ్యుయేట్ల సంఖ్య మొత్తం 3,106 మంది స్టూడెంట్స్ ఉన్నారు. SQU క్యాంపస్‌లోని ఓపెన్-ఎయిర్ థియేటర్‌లో జరిగిన స్నాతకోత్సవంలో సైన్స్ కళాశాలల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల నుండి మొత్తం 1,712 మంది విద్యార్థులు గ్రాడ్యూయేట్లు ఉన్నారు.  వీరిలో 520 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల నుండి ఉత్తీర్ణత సాధించారు. వీరికి న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ సయీది ఆధ్వర్యంలో సర్టిఫికేట్లను అందజేశారు.

కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్, అగ్రికల్చరల్ అండ్ మెరైన్ సైన్సెస్, సైన్స్, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుండి డాక్టరల్ డిగ్రీలతో పట్టభద్రులైన 62 మంది విద్యార్థులకు ముఖ్య అతిథిగా సర్టిఫికెట్లను అందజేశారు. తరువాత మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్, నర్సింగ్, అగ్రికల్చరల్ అండ్ మెరైన్ సైన్సెస్, సైన్స్, ఇంజనీరింగ్, లా, ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, మరియు ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ కళాశాలల నుండి మాస్టర్స్ డిగ్రీలు పొందిన 458 మంది గ్రాడ్యుయేట్లకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం బ్యాచిలర్ డిగ్రీ పొందిన గ్రాడ్యుయేట్లకు సర్టిఫికెట్లను అందజేశారు. మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్ కళాశాల నుండి మొత్తం పట్టభద్రుల సంఖ్య 157, నర్సింగ్ కళాశాల నుంచి 141 మంది,  అగ్రి సైన్స్ కళాశాల 177 గ్రాడ్యుయేట్లు, కాలేజ్ ఆఫ్ సైన్స్ నుండి బ్యాచిలర్ డిగ్రీ పొందిన 380 గ్రాడ్యుయేట్లు సర్టిఫికేట్లను అందుకున్నారు. చివరగా ఇంజనీరింగ్ కళాశాల నుండి బ్యాచిలర్ డిగ్రీ పొందిన 337 గ్రాడ్యుయేట్లు సర్టిఫికెట్లను అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com