లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- December 06, 2025
కువైట్: కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ (PAI) తన 2024 ఇండస్ట్రియల్ సర్వే నివేదిక ఫలితాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సుమారు 109,000 మంది కార్మికులను నియమించినప్పటికీ, కువైట్ కార్మికులు పారిశ్రామిక రంగంలోని శ్రామిక శక్తిలో 11% మాత్రమే ఉన్నారని వెల్లడించింది. ఈ నివేదిక బలమైన జాతీయ శ్రామిక శక్తి అభివృద్ధి వ్యూహాల అవసరాన్ని హైలైట్ చేస్తుందని PAI యాక్టింగ్ డైరెక్టర్ జనరల్, షామ్లాన్ అల్-జహ్దాలి తెలిపారు. అథారిటీ లైసెన్స్ పొందిన 741 పారిశ్రామిక సంస్థలను పరిశీలించివేసిట్లు వెల్లడించారు.
పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంలో, పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన సాధనంగా మిగిలిందని అల్-జహ్దాలి నొక్కిచెప్పారు. 2023లో మొత్తం పారిశ్రామిక ఉత్పత్తులు విలువ KD 5.07 బిలియన్లకు చేరుకుందని వెల్లడించారు.
2023లో పారిశ్రామిక రంగం మొత్తం కార్మికుల పరిహారంలో 784.5 మిలియన్ కువైట్ దినార్లు చెల్లించిందని సర్వే వెల్లడించింది.అయితే, మొత్తం శ్రామిక శక్తిలో కేవలం 11% మాత్రమే ఉన్న కువైట్ పౌరుల పరిమిత భాగస్వామ్యం ఒక ప్రధాన సవాలుగా మారిందని, ఈ రంగంలో జాతీయ కార్మిక భాగస్వామ్యాన్ని పెంచడానికి శిక్షణ, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కార్యక్రమాలు అవసరమని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కిడ్నీ రోగులకు ఊరట ..!!
- లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!
- ఇజ్రాయెల్ ప్రకటనపై 8 అరబ్ ఇస్లామిక్ దేశాలు ఆందోళన..!!
- డ్రగ్స్ తో తడిసిన పేపర్ పార్సిల్..మహిళకు జైలుశిక్ష..!!
- సౌదీలో 18శాతం పెరిగిన దేశీయ పర్యాటక వ్యయం..!!
- హైదరాబాద్‌లో అల్లూ సినిమాస్ కొత్త డాల్బీ థియేటర్
- ఆఫీస్ తరువాత ఫోన్ కాల్స్, మెయిల్స్‌ను ఉద్యోగులు పట్టించుకోకండి..
- జమిలి ఎన్నికల పై కొనసాగుతున్న చర్చలు
- ఏపీ: ఈరోజు మెగా జాబ్ మేళా







