4వ ఫ్లోర్‌ నుంచి పడ్డ యువతి

- July 26, 2016 , by Maagulf
4వ ఫ్లోర్‌ నుంచి పడ్డ యువతి

16 ఏళ్ళ అరబ్‌ యువతి తాను నివాసం ఉంటోన్న భవంతిలోని నాలుగో ఫ్లోర్‌ నుంచి కింద పడి, తీవ్ర గాయాలపాలైంది పెల్విస్‌, లంగ్‌, స్పైన్‌, చెస్ట్‌ తదితర ప్రాంతాల్లో తీవ్రగాయాలతోనూ, 20 ఫ్రాక్చర్లతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అంబులెన్స్‌తో ప్రమాద స్థలికి చేరుకున్నారు. ఆమెను కువైట్‌ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కువైట్‌ హాస్పిటల్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఇసా అల్‌ మలామి చెప్పారు. ఆమె ఛాతీ కుడి భాగంలో ట్యూబ్‌ని అమర్చామనీ, ప్రస్తుతం పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ ఆమెకు కొన్ని శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందని ఆయన వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com