బంగారం, వెండి ధరలుమళ్లీ పెరిగాయి

- July 26, 2016 , by Maagulf
బంగారం, వెండి ధరలుమళ్లీ పెరిగాయి

గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలుమళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో మంగళవారం బంగారం ధర రూ. 110 పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ. 30,790కి చేరింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ ఎక్కువవడంతో ధరలు పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.
వెండి ధర కూడా నేడు రూ. 320 పెరిగింది. దీంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 46,200కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధరలు పెరిగాయి. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com