బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- December 07, 2025
మనమా: బహ్రెయిన్ లో శిక్షాస్మృతికి సవరణలలో భాగంగా జైళ్ల పేరును 'సంస్కరణ మరియు పునరావాస కేంద్రాలు'గా మార్చాలని ప్రతిపాదించారు. ఈ మేరకు క్యాబినెట్ ప్రతినిధుల సభకు ఒక ముసాయిదా చట్టాన్ని పంపించారు.అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) గైడ్ లైన్స్ ప్రకారం..బహ్రెయిన్ చట్టాలలో సంస్కరణలను అమలు చేయనున్నారు.
2025 నాటి డిక్రీ నంబర్ (68) ముసాయిదా చట్టం, శిక్షాస్మృతిలో 'జైలు' స్థానంలో 'సంస్కరణ మరియు పునరావాస కేంద్రం' అని పేర్కొన్నారు. ప్రతిపాదిత సవరణల ప్రకారం, కస్టోడియల్ శిక్షలు అనుభవిస్తున్న వారు ఈ కేంద్రాలలో పునరావాసం మరియు శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది. బహ్రెయిన్ 1998లో ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్‌కు అంగీకరించింది. ఇప్పుడు ప్రిజన్ చట్టాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా సంస్కరణలు చేస్తున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







