బహ్రెయిన్ కంపెనీ కార్మికుల నిరాకరింపు ఆరోపణపై ఖండన
- July 26, 2016
మనామా: 70 మంది కార్మికులని వారి వసతి నుండి యధేచ్ఛగా తొలగించినట్లు వచ్చిన ఆరోపణలపై సోమవారం సంబంధిత ప్రైవేట్ సంస్థ ఖండించింది.
సోమవారం ఉదయం భారత రాయబార కార్యాలయానికి ఆ కార్మికులు నేరుగా పిర్యాదు చేయడానికి వెళ్ళిన సంగతి పాఠకులకు విదితమే తమను ఈ దేశంకు తీసుకొని వచ్చిన ప్రాయోజికుడు తమకు ఎటువంటి సదుపాయాలు అందివ్వకుండా బయటకు గెంటివేశాడని పిర్యాదు చేశారు. ఆ వ్యక్తి తమను రోజుకు 12 గంటలకు పైగా పని చేస్తున్నాడని , ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పనిచేస్తున్నట్లు తెలిపారు. వేసవి పని నిషేధం ఉన్న విరామ గంటల సమయంలో కూడా పని చేయాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని, దీనితో తాము మండు వేసవికాలంలో పని చేస్తున్నట్లు సంబంధిత సంస్థపై రాయబార అధికారులకు కార్మికులు వివరించారు..ఆదివారం సుమారు సాయంత్రం 5 గంటల సమయంలో సైతం వారు అసాధారణంగా పని చేయించడంతో ఫిర్యాదు చేసేందుకు తమ సంస్థ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ వారిని వసతి గృహం లోనికి వెళ్లేందుకు ప్రాయోజికుడు అనుమతించలేదు. చమురు ట్యాంకర్లు నిర్వహణ చేసే భారీ పనికిగాను జీతం గా బీడీ 70 లను ఇస్తున్నారని ఆహారం కోసం మరొక బి డి 10 ఇవ్వటం లేదని ఆరోపించారు. అయితే వారు తమ జీతాలకు సంబంధించిన ఫిర్యాదులు మినహా మరే ఇతర ఆరోపణలు చేయలేదు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాలలో పని చేయడం మనిషికి అసాధ్యం అని కార్మికులు పేర్కొంటున్నారు
70 మంది కార్మికులు వారిని ఆదివారం వారి సదుపాయాలు నుంచి బయటకు తన్నాడు ఆరోపిస్తూ, లో అడ్లియా భారత ఎంబసీ సమీపంలో నిన్న తరలివచ్చారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ప్రైవేట్ సంస్థ ప్రతినిధి ఈ సందర్భంగా " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, ఈ 70 మంది కార్మికులు ఆరు నెలల క్రితం బహరేన్ వచ్చేరని పేర్కొంటూ, వారు ఇక్కడకు వచ్చే ముందు వారి వేతనాలు, అలవెన్సులు గూర్చి ఒక పని ఒప్పందం కుదుర్చుకున్నట్లు దాని ప్రకారం ఆ కార్మికులు ఇక్కడ వచ్చినట్లు తెలిపారు. హఠాత్తుగా ఇపుడు వారు జీతం పెంచాలని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ప్రస్తుతం కార్మికులు అకస్మాత్తుగా పని నిలిపివేయడంతో సంస్థ ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. చట్టాలు మరియు నిబంధనలు ప్రకారం బహ్రెయిన్ రాజ్యంలో కార్మికులు ఇటీవల కాలంలో చేసిన సంతక ఒప్పందం ప్రకారం పని చేయక తప్పదన్నారు. వారి ఒప్పందాల పునరుద్ధరణ సమయంలో జీతాల పెంపుదల గూర్చి పరిగణన లోనికి తీసుకొంటానని సంస్థ అధికారి తెలిపారు. ఆ కార్మికులతో ఓవర్ టైం పని చెంచడం లేదని పేర్కొన్నారు. సోమవారం కొందరు కార్మికుల చేసిన ఆరోపణలను అయన త్రోసిపుచ్చారు. గత 20 సంవత్సరాలుగా ఈ రంగంలో తమ సంస్థ ఉందని, మేము గతంలో ఇటువంటి సమస్యలు చూడలేదని, తమ సంస్థలో వివిధ శాఖల లో 250 మంది సిబ్బంది ఉన్నారని, కార్మికులు ఆరోపిస్తున్న ప్రాంతంలో తమకు ఇంకా 150 మంది కార్మికులు ఉన్నారని ప్రతినిధి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







