వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!

- December 08, 2025 , by Maagulf
వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!

యూఏఈ: యూఏఈలో వింటర్ ట్రావెల్ ఇల్నెస్ గురించి డాక్టర్స్ అలెర్ట్ జారీ చేశారు. ఫ్లూ సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది అని పేర్కొన్నారు. నివాసితులు ముందస్తు ప్రయాణ వివరాలను ముందుగానే క్లారిటీగా తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.  దీని కారణంగా ప్రయాణాల్లో ఊహించని వైద్య అత్యవసర పరిస్థితులను నివారించవచ్చని సూచించారు.  యూఏఈ కంటే విదేశాలలో ఎక్కువగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు హెచ్చరించారు.   

ప్రయాణ సమయంలో లేదా తర్వాత 22–64 శాతం మంది అంతర్జాతీయ ప్రయాణికులు అనారోగ్యానికి గురవుతున్నారని పబ్‌మెడ్ సెంట్రల్ నుండి వచ్చిన ప్రపంచ డేటాను డాక్టర్లు ఉదహరణగా పేర్కొన్నారు. ముఖ్యంగా చల్లని, రద్దీగా ఉండే గమ్యస్థానాలకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఇంటర్నేషనల్ మోడరన్ హాస్పిటల్ దుబాయ్‌లోని డాక్టర్ మహమూద్ మేధాత్ సూచించారు. ముఖ్యంగా దీర్ఘకాలిక పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు అదనపు జాగ్రత్తలను తీసుకోవాలని వెల్లడించారు.  పిల్లలు, వృద్ధులు మరియు ఉబ్బసం, డయాబెటిక్ లేదా గుండె సంబంధ వ్యాధులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలని, వృద్ధులు న్యుమోకాకల్ వ్యాక్సిన్‌లను సకాలంలో వెసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రయాణ సమయంలో తగినంత నిద్ర, హైడ్రేషన్, పోషకాహారం తీసుకోవాలన్నారు.   రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్ టెర్మినల్స్, ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్‌లు, పర్యాటక హాట్‌స్పాట్‌లు అన్నీ వైరల్ వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతాయని ఆస్టర్ సెడార్స్ హాస్పిటల్ & క్లినిక్ జెబెల్ అలీలో ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ బిర్జిస్ షేక్ అన్నారు.

    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com