బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- December 08, 2025
మనమా: బహ్రెయిన్, యూఏఈ లక్ష్యంగా ఇరాన్ చేసిన కామెంట్స్ పై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సెక్రటరీ జనరల్ జాసెం మొహమ్మద్ అల్బుదైవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ వైఖరిని తప్పుబట్టారు. జిసిసి సభ్య దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే విధంగా ప్రకటనలు ఉన్నాయని తెలిపారు. ఆ ప్రకటనలు తప్పుడు వాదనలు లేదా తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు.
ముఖ్యంగా, ఇరాన్ వ్యాఖ్యలు బహ్రెయిన్ సార్వభౌమత్వాన్ని, ప్రస్తుతం ఇరాన్ నియంత్రణలో ఉన్న మూడు దీవులు టర్ తున్బ్, లెస్సర్ తున్బ్ మరియు అబు ముసా లపై యూఏఈ చట్టబద్ధమైన హక్కులకు విఘాతం కలిగేలా ఉన్నాయని తెలిపారు. కువైట్ మరియు సౌదీ అరేబియా సంయుక్త యాజమాన్యంలోని అల్-దుర్రా ఆఫ్షోర్ ఆయిల్ క్షేత్రంపై సార్వభౌమ హక్కులను తగ్గించాయని అల్బుదైవి మండిపడ్డారు.
ఇరాన్ ప్రకటనలు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించాయని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య దూరం పెంచే ఇలాంటి ప్రకటనలను జారీ చేయడం వెంటనే నిలిపివేయాలని పులుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







