ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- December 08, 2025
దోహా, ఖతార్: ఖతార్ లో ఇంటర్నేషనల్ వాలంటీర్ డే సందర్భంగా ఖతార్ సోషల్ డెవలప్మెంట్, ఫ్యామిలీ మంత్రిత్వ శాఖ (MSDF) మంత్రి బుతైనా బింట్ అలీ అల్ జబర్ అల్ నుయిమి నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్‌ను ప్రారంభించింది. ఖతార్‌లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, స్వచ్ఛంద సేవ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, దేశంలో స్వచ్ఛంద సేవ భవిష్యత్తును రూపొందించే ప్రయత్నాలలో ఈ ల్యాబ్ ప్రారంభం భాగమని పేర్కొన్నారు. ఇది మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుందని వెల్లడించారు.
స్వచ్ఛంద సేవా రంగాన్ని అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, ఇప్పటికే పలు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటుచేసినట్లు ఆమె పేర్కొన్నారు. నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల మధ్య అభివృద్ధి మరియు ఆవిష్కరణలకు అనుసంధాన కర్తగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







