తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- December 08, 2025
అమరావతి: తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కఠినంగా స్పందించారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిని తెలుసుకోవడానికి ఆమె తిరుపతి ఎస్పీ మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరించారు. నిందితులపై కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
ఫిర్యాదు అందగానే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని హోంమంత్రి పేర్కొన్నారు. తిరుపతి ఎస్పీ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో సాక్ష్యాలు, కీలక సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఒడిశాకు పంపినట్లు వెల్లడించారు.
మహిళల భద్రతపై రాష్ట్ర హోంమంత్రి హై అలర్ట్
మంత్రిత్వంలో అనిత, బాధితురాలికి న్యాయం కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పునరుద్ఘాటించారు. మహిళల భద్రత ప్రభుత్వానికి ప్రాధాన్యత ఉన్నదని, ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ మన్నించరని ఆమె హెచ్చరించారు. పోలీసులు వేగవంతమైన దర్యాప్తు నిర్వహించి, బాధితురాలకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలని హోంమంత్రి ఆదేశించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







