సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- December 10, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని జెడ్డాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు ప్రాంతాలలో వర్షాలు కురిసాయి. చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించడానికి నివాసితులు పార్కులు, తదితర ప్రాంతాలకు తరలివచ్చారు.
జెడ్డా సహా మక్కా ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసే వాతావరణ పరిస్థితుల మధ్య సివిల్ డిఫెన్స్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మరియు భద్రతా సూచనలను పాటించాలని వాతావరణ మంత్రిత్వశాఖ కోరింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, లోయలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
వర్షాకాలంలో జెడ్డాలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు, రోడ్లను క్లియర్ చేయడానికి, రద్దీని తగ్గించడానికి మరియు నీటి లాగ్ లను తొలగించడానికి సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని, అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెస్క్యూ టీమ్స్ సర్వసన్నద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
రాబోయే రెండు మూడు రోజులు మక్కా, మదీనా, ఖాసిం, హైల్, అలాగే ఉత్తర సరిహద్దులు మరియు అల్-జౌఫ్లోని కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని, తూర్పు ప్రావిన్స్‌లోని ఉత్తర ప్రాంతాలకు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్‌లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







