గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..

- December 12, 2025 , by Maagulf
గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..

ఏఐ ప్రపంచంలో పోటీ ఎక్కుపెట్టిన సమయంలో, ఓపెన్‌ఏఐ అత్యంత శక్తివంతమైన మోడల్ ChatGPT 5.2‌ ను విడుదల చేసి మరోసారి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది.గూగుల్‌ తాజా Gemini 3 లాంచ్‌తో దిగిన ఒత్తిడికి ‘కోడ్ రెడ్’ ప్రకటించిన రోజులు గడవకముందే, మెరుగైన మేధస్సు, రియల్-వర్ల్డ్ పనులలో శీఘ్ర స్పందన, విజన్ అప్‌గ్రేడ్‌లు, దీర్ఘ కాంటెక్స్ట్ అర్థం చేసుకునే శక్తి వంటి సామర్థ్యాలతో GPT-5.2ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. స్ప్రెడ్‌షీట్‌ల రూపొందించడం నుంచి ప్రెజెంటేషన్లు, కోడింగ్, ఇమేజ్ అర్థం చేసుకోవడం దాకా ఇది ప్రొఫెషనల్ స్థాయిలో మరింత శక్తివంతమైన పనితీరును ఇస్తుందని ఓపెన్‌ఏఐ ప్రకటించింది. ముఖ్యంగా, GPT-5.1 తో పోలిస్తే 5.2 బెంచ్‌మార్క్‌లలో సాధించిన రికార్డు స్కోర్లు దీనికి మరింత ప్రత్యేకతను తీసుకువచ్చాయి.

ఇక గూగుల్‌ Gemini 3తో పోటీ విషయంలో రెండు కంపెనీలూ అసలు తగ్గడం లేదు. Gemini 3 Pro మల్టీమోడల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సామర్థ్యాల్లో ముందంజలో ఉందని గూగుల్ చెబుతున్న వేళ, ఓపెన్‌ఏఐ మాత్రం GPT-5.2 ప్రాక్టికల్ వర్క్‌లో మరింత ప్రభావవంతంగా ఉందని నమ్ముతోంది. వినియోగదారుల అభిప్రాయాలు, పెర్ఫార్మెన్స్ లీడర్‌బోర్డ్‌లు, రాబోయే ఏజీఐ దిశగా రెండు టెక్ దిగ్గజాలూ పోటాపోటీగా అడుగులు వేస్తుండటంతో 2025 ఏఐ రంగానికి కీలక సంవత్సరంగా మారింది.

  • ChatGPT 5.2, GPT-5.1 కంటే ప్రతి విభాగంలో అధిక పనితీరు
  • దీర్ఘ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడంలో ముఖ్యమైన మెరుగుదల
  • ఫోటోలు అర్థం చేసుకునే విజన్ మోడల్ అప్‌గ్రేడ్
  • స్ప్రెడ్‌షీట్‌లు, ప్రెజెంటేషన్లు, కోడ్ రాయడంలో వేగం + ఖచ్చితత్వం
  • బహుళ దశల క్లిష్ట పనులను మరింత స్మార్ట్‌గా నిర్వర్తించే సామర్థ్యం
  • బెంచ్‌మార్క్‌లలో కొత్త రికార్డ్‌లు
  • Gemini 3 కి ప్రత్యక్ష పోటీగా అభివృద్ధి
  • పేడ్ యూజర్లకు GPT-5.2 ఇప్పటికే అందుబాటులో
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com