డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- December 13, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, ప్రతీ నెలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకటో తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తోంది. ఈ పెన్షన్ల పంపిణీ గతంలో వాలంటీర్ల ద్వారా జరుగుతుండగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత, సచివాలయ ఉద్యోగుల చేతుల్లో అప్పగించింది. జనవరి నెలలో, కొత్త ఏడాది వేడుకలు జరగనున్న నేపథ్యంలో, గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2026 లో వచ్చే జనవరి 1వ తేదీ, కొత్త సంవత్సరమైనందున, జనవరి 31వ తేదీన ఈ పెన్షన్ల పంపిణీ చేయాలని వారు అభ్యర్థించారు.
మరిన్ని పెన్షన్ల పంపిణీని జనవరి 2వ తేదీకి షెడ్యూల్ చేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సూచిస్తున్నారు.ఇందుకు తోడు, గత ఏడాది కూడా ప్రభుత్వం డిసెంబర్ 31న పెన్షన్ల పంపిణీని ముందుగా ప్రారంభించిన విషయం తెలిసిందే.ఈ సంవత్సరం కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో, ఒకటో తేదీ పెన్షన్ల పంపిణీని సులభతరం చేసేందుకు ప్రభుత్వం మార్పులు చేసినది, దాంతో ఈసారి కూడా ఉద్యోగులు సానుకూల నిర్ణయానికి ఆశపడుతున్నారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







