మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- December 13, 2025
కోల్‌కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు.శనివారం తెల్లవారు జామున కోల్‌కతాలో అడుగు పెట్టిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే, ఉదయం కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ సందడి చేశారు. అతన్ని చూసేందుకు పెద్దెత్తున అభిమానులు తరలివచ్చారు.
మెస్సిని దగ్గరి నుంచి చూడాలని, అతడి ఆటను వీక్షించాలని కొన్నిరోజులుగా అభిమానులు ఎదురు చూశారు. ఇలాంటి సమయంలో మెస్సీ స్టేడియంలో నుంచి త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వీరిలో కొందరు అభిమానులు బారికేడ్లు దాటుకొని మైదానంలోకి వచ్చి రచ్చరచ్చ చేశారు. మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన టెంట్‌ను కూల్చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జి చేశారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







