బ్యాడ్ గాళ్స్ వ‌చ్చేస్తున్నారు..

- December 13, 2025 , by Maagulf
బ్యాడ్ గాళ్స్ వ‌చ్చేస్తున్నారు..

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ బ్యాడ్ గాళ్స్. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్ ద‌ర్శ‌కుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి డైరెక్ష‌న్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా ఆస్కార్ చంద్ర బోస్ అన్ని పాటలకు లిరిక్స్ అందించారు. క్రిస్మ‌స్ కానుక‌గా ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ..ఈ మూవీ పూర్తి ఎంట‌ర్‌టైన్ అని తెలిపారు. జాతి రత్నాలు, మ్యాడ్ లాంటి హిలేరియస్ చిత్రాలు అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రమే ఈ సినిమా అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com