ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..

- December 15, 2025 , by Maagulf
ఆస్తుల పర్యాటక లీజు పై ప్రత్యేక కమిటీ..

అమరావతి: రాష్ట్ర పర్యాటకభివృధ్ధి సంస్థకు చెందిన 22 హోటళ్లు, రిసార్టులు, ఇతర ఆస్థుల లీజుకు బిడ్ల మదింపు కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండి ఈ కమిటీకి చైర్మన్ గా రాష్ట్ర పర్యాటక సంస్థ సిఇఒ కో-చైర్మన్ గా ఉంటారు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఇడిని కన్వీనర్ గా మరో ఐదుగురిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఆస్థుల నిర్వహణను లీజు పై ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

విశాఖలోని మధురవాడలో మెగ్లాన్ లీజర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు ఐదెకరాల భూమితో పాటు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకే ఉత్తర్వులిచ్చింది. ఈ సంస్థ రూ.348.12 కోట్లతో ఫైక్టార్ హోటల్ ను నిర్మించనుంది. విశాఖలోని ఎండాడలో పివిఆర్ హాస్పిటాలిటీస్ అథ్వర్యంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి మూడెకరాలతో పాటు రాయితీలు ఇవ్వనుంది. బాపట్ల మండలం పాండురంగాపురం బీచ్లో యాగంటి ఎస్టేట్స్, ఫైవ్ స్టార్ బీచ్రిసార్టు ఏర్పాటుకు రాయితీలు ఇచ్చింది. తిరుపతిలో నాంది సంస్థకు 4 స్టార్ హోటల్ నిర్మాణం కోసం రాయితీలు ఇవ్వాలని వేర్వేరు జీఓల్లో ఆదేశాలిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com