ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..
- December 15, 2025
అమెరికా: హెచ్-1బీ, హెచ్-4 వీసాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వం నేటి నుంచే సమగ్ర స్క్రీనింగ్ ప్రక్రియను అమల్లోకి తెచ్చింది.ఈ కొత్త విధానంలో భాగంగా వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించనున్నారు.ఈ విషయాన్ని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా వెల్లడించింది.ఇక పై డాక్యుమెంట్లతో పాటు ఆన్‌లైన్ కార్యకలాపాలు కూడా వీసా నిర్ణయాల్లో కీలకంగా మారనున్నాయి.
హెచ్-1బీతో పాటు హెచ్-4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలనూ పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అందుకే అభ్యర్థులు తమ ఖాతాలను ప్రైవేట్ నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాలని సూచించారు. ఇప్పటికే భారత్‌లో హెచ్-1బీ (H-1B) ఇంటర్వ్యూలు పూర్తి చేసినవారికీ, తాజా మార్గదర్శకాల నేపథ్యంలో మరోసారి ఇంటర్వ్యూకు పిలిచే అవకాశం ఉందన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
ఈ అంశంపై స్పందించిన స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి, అమెరికా వీసా హక్కు కాదని, అది భద్రతా ప్రమాణాల ఆధారంగా ఇచ్చే అనుమతిమాత్రమేనని అన్నారు. దేశ భద్రతకు, ప్రజారక్షణకు ముప్పుగా మారే అంశాలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించేందుకే ఈ కఠిన పరిశీలన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో హెచ్-1బీ, హెచ్-4 వీసాలపై ఉన్న భారతీయులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







