14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- December 15, 2025
కువైట్: కువైట్ లో బ్యాచిలర్స్ కు చట్టవిరుద్ధంగా రెంట్ కు ఇచ్చిన ఆస్తులపై చర్యలు తీసుకుంటున్నారు.కేవలం 14 రోజుల్లోనే 21 ఆస్తులకు విద్యుత్తును నిలిపివేసి, 38 మందికి నోటీసులు జారీ చేసినట్లు ఫర్వానియా గవర్నరేట్ మునిసిపాలిటీ శాఖలోని అత్యవసర బృంద అధిపతి మొహమ్మద్ అల్-జలావి తెలిపారు.
మునిసిపాలిటీ 12 మంది ఇన్స్పెక్టర్లతో కూడిన ఆరు మొబైల్ ఫీల్డ్ బృందాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఖైతాన్‌లో ఉల్లంఘనలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయని అన్నారు. ఆ తర్వాత అల్-రబియా, అల్-ఒమారియా, అల్-అండలస్ మరియు అల్-ఫిర్దౌస్ నివాస ప్రాంతాలలో ఉల్లంఘనలు అధికంగా నమోదు అవుతున్నాయని తెలిపారు.
ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా బ్యాచిలర్స్ కు ఇవ్వడం, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించడం, గదుల్లో అంతర్గత పార్టిషన్లు ఏర్పాటు చేయడం వంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహారిస్తామని, వీటిని గుర్తించడానికి నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని మొహమ్మద్ అల్-జలావి వెల్లడించారు.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







