షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- December 15, 2025
దోహా: దోహాలో జరిగిన తొమ్మిదవ ఎడిషన్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఇంటర్నేషనల్ యాంటీ-కరప్షన్ ఎక్సలెన్స్ (ACE) అవార్డు విజేతలను అమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ సత్కరించారు.ACE అవార్డు అవినీతికి వ్యతిరేకంగా పోరాటంలో ముందంజలో ఉన్న ధైర్యవంతులైన వ్యక్తులు మరియు సంస్థలను గుర్తించి అందజేస్తారు.
ఈ వేడుకలో అకడమిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ మెటీరియల్స్ అవార్డు విజేతలు ప్రొఫెసర్ నికోస్ పాసాస్, డాక్టర్ మరియాన్ కామెరర్, ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అవార్డు విజేతలు గ్లోరియా పల్లారెస్-వెనియల్స్, టటెండా చిటాగు, ఆండిస్వా మాటేంకాను అమీర్ సత్కరించారు.
వీరితోపాటు యూత్ క్రియేటివిటీ అండ్ ఎంగేజ్‌మెంట్ అవార్డు విజేతలు మార్ నియాంగ్, మోతివుల్లా వెసాతో పాటు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ మరియు అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్ అవార్డు విజేతలు డ్రాగో కోస్,డాక్టర్ ఒబియాగెలి ఎజెక్వెసిలిని కూడా అమీర్ సత్కరించారు.
ఈ వేడుకలో ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థాని, షురా కౌన్సిల్ స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనిమ్, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో, అనేక మంది మంత్రులు, సీనియర్ అధికారులు, దౌత్యవేత్తలు మరియు విశిష్ట అతిథులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







