ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- December 16, 2025
తిరుమల: తిరుమల కొండ పై అమలవుతున్న తరహాలో టిటిడి(TTD) పరిధిలోని 60 స్థానిక ఆలయాల్లో భక్తులు సులభతరంగా యూపిఐ ద్వారా నగదు చెల్లింపులు చేసే సౌలభ్యం కల్పిస్తున్నట్లు టిటిడి 22 అనిల్కుమార్సింఘాల్ తెలిపారు. ఇందుకు అవసరమైన కియోస్క్ యంత్రాలు, క్యూఆర్ కోడ్స్ సా స్కానర్లు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. కర్నాటక బెలగావిలో ఆలయం నిర్మాణం, బీహార్‌లోని పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపుపై ఆయా రాష్ట్ర అధికారులతో సంప్రదించి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.
సోమవారం టిటిడి(Tirumala) పరిపాలన భవనంలో టిటిడి జెఇఒ వీరబ్రహ్మం, సివిఎసీ కెవి మురళీకృష్ణ, ఎపిసిఎఒ బాలాజీ, సిఇ సత్యనారాయణ, డిప్యూటీ సిఎఫ్ ఫణికుమార్నాయుడు, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవి, రవాణాజిఎం శేషారెడ్డితో కలసి ఇఒ సింఘాల్ పలు అంశాలపై సమీక్షించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో టిటిడి నిర్మించదలచని ఐదువేల ఆలయాలకు అసవరమైన రెండు మూడు డిజైన్లు సిద్ధంచేయాలని సిఇని ఆదేశించారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణ ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో సిసి కెమెరాల ఏర్పాటు పనులను కూడా వేగవంతం చేయాలని ఇఒ సింఘాల్ ఆదేశించారు. తిరుమలలో శ్రీవారి ఆలయంలో ఉన్న కదిలే వంతెన మరమ్మతు పనులను వైకుంఠ ఏకాదశిలోపు పూర్తిచేయాలన్నారు. ముంబైలోని బాంద్రాలో ఆలయంలో జెఇఒ, సిఇ సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇఒ సింఘాల్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







