దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- July 11, 2026
దోహా: దివ్యాంగులు మరియు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) ఉన్న చిన్నారులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించే దిశగా ఖతార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న ఎడ్యుకేషన్ వౌచర్ పథకాన్ని విస్తరించి, ఇకపై నర్సరీల్లో చదివే చిన్నారులు మరియు ప్రైవేట్ విద్యా కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చింది. ఖతార్ విద్యా, ఉన్నత విద్యా శాఖ మంత్రి లోల్వా బింట్ రషీద్ బిన్ మహ్మద్ అల్ ఖాతర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మంత్రివర్గం ఆమోదించిన ఈ నిర్ణయంతో అర్హులైన పిల్లలకు ఏడాదికి QR 43,000 నుంచి QR 78,000 వరకు విద్యా వౌచర్లు అందించనున్నట్లు తెలిపారు.
ఈ పథకం ద్వారా దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు చిన్న వయస్సులోనే అవసరమైన విద్యా, పునరావాస సేవలు అందుబాటులోకి రావడంతో పాటు, తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. అలాగే ప్రత్యేక విద్యా సేవల్లో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరిగి, సేవల నాణ్యత మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాల సమయాల తర్వాత, సెలవులలోనూ విద్యా, పునరావాస సేవలు కొనసాగించే అవకాశం ఉండటంతో పిల్లలకు నిరంతర సహాయం అందనుండగా, తల్లిదండ్రులకు కూడా ఉపశమనం లభించనుంది.
ఆమోదిత వైద్య నివేదికల ఆధారంగా అర్హులైన వారికి ఈ పథకం వర్తిస్తుందని మంత్రి తెలిపారు. దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు నాణ్యమైన విద్య, పునరావాస సేవలు అందించడం దేశ బాధ్యతగా భావిస్తున్నామని, సమాజంలోని ఈ వర్గానికి అనుకూలమైన విద్యా వాతావరణాన్ని కల్పించడం ఖతార్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







