చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..

- December 16, 2025 , by Maagulf
చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..

అమరావతి: కూటమి ప్రభుత్వం పాలనపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం భవానీపురం జోజి నగర్‌లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అన్యాయం చేస్తుందని, న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ.. అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని జగన్ అన్నారు.

25 సంవత్సరాలుగా‌ ఇక్కడే ఉంటున్నారు. సుప్రీంకోర్టు‌లో న్యాయపోరాటం జరుగుతోంది. డిసెంబరు 31 వరకు సుప్రీంకోర్టు ఊరట ఇచ్చింది. అయినా, 42 కుటుంబాలను పోలీసులను అడ్డం పెట్టుకుని 200 మంది‌ పోలీసులు వచ్చి నిర్దాక్షిణ్యంగా ఇల్లు కూల్చరు.  పెద్దక సహకారంతో నే ఇంత అకస్మాత్తుగా కూల్చారు. అధికార దుర్వినియోగం చేస్తూ అందరినీ రోడ్డు పాలు చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

2.17 ఎకరాలు.. రూ.150 కోట్లు విలువైన భూమి ఇది. ఇందులో ప్రయివేటు వారు ఎంటర్ అయ్యారు. 2016లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు. ఫేక్ సొసైటీ ఏర్పాటు చేసి దోపిడీ చేశారు. జనసేన కార్పోరేటర్ అన్న కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారని జగన్ ఆరోపించారు. పోలీసులు అన్యాయస్తులకు మద్దతు ఇచ్చి ఇళ్ల కూల్చివేతకు‌ సహకరించడం దారుణమని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదలు 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. అన్ని రకాల అనుమతులు ఇచ్చారు కూడా. బ్యాంకు రుణాలు కూడా వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ఈఎంఐలు కూడా కడుతున్నారు. స్థలం వేరే వారిది ఐతే అప్రూవల్ ఎలా ఇచ్చారు? అని జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కరెంటు, డ్రైన్స్ ఎలా ఇచ్చారు? బ్యాంకు లోన్లు ఎలా ఇచ్చారు? అన్నీ సవ్యంగా ఉన్నందునే ఇల్లు కట్టుకున్నారు. కొనుగోలు జరిగేటప్పుడు కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ, ఇప్పుడు రూ.150 కోట్ల విలువైన స్థలం కబ్జా కోసం పేదలను రోడ్డున పడేశారని జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ప్రభుత్వం పేదలను పట్టించుకోదా? చంద్రబాబును మూడుసార్లు, లోకేశ్‌ను రెండు సార్లు కలిశారు. కానీ, వాళ్ల మనుషులే కుట్ర పన్ని పేదలను అన్యాయం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి. పేదలకు వత్తాసు పలకకపోగా ప్రభుత్వమే కోర్టుకు వెళ్లింది. వారి రుణాలను ప్రభుత్వమే తీర్చాలి. స్థలం ఇక్కడే ఇస్తారా? మరోచోట ఇస్తారా?. మేము అధికారంలోకి వచ్చాక ఈ ఘటనపై విచారణ జరిపిస్తాం. బాధితులకు న్యాయం చేస్తామని జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com