డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- February 08, 2026
కువైట్:కువైట్ లో మాదకద్రవ్య కేసులకు సంబంధించి వివిధ దేశాలకు చెందిన 16 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మాదకద్రవ్యాలు మరియు వాటి తయారీ, పంపిణీలో ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. మాదకద్రవ్య వ్యాపారులు మరియు వినియోగదారులను గుర్తించడానికి మోడ్రన్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో 880 గ్రాముల మెథాంఫెటమైన్ (క్రిస్టల్ మెత్), 745 గ్రాముల హషీష్, మూడు ముక్కలు హషీష్, 151 గ్రాముల సింథటిక్ కానబినాయిడ్స్, 40 మిల్లీలీటర్ల సింథటిక్ కానబినాయిడ్ ఆయిల్, మూడు గ్రాముల హెరాయిన్, 5,000 కాప్టాగన్ పిల్స్, అలాగే మాదకద్రవ్యాలను తూకం వేయడానికి ఉపయోగించే అనేక ఉపకరణాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిందితులపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







