సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- December 17, 2025
యూఏఈ: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్‌లో ఈరోజు తెల్లవారుజామున 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.11 గంటలకు వచ్చింది. భూకంప కేంద్రం 50 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొన్నారు.
కాగా, ఈ భూకంపం యూఏఈపై ఎలాంటి ప్రభావం చూపలేదని మరియు ఎమిరేట్స్‌లోని నివాసితులకు ఇది అనుభూతిలోకి రాలేదని స్పష్టం చేసింది.
గల్ఫ్ దేశంలో చివరిసారిగా భూకంపం ఈ ఏదాది ఏప్రిల్‌లో సంభవించింది. అప్పుడు యూఏఈ - సౌదీ అరేబియాలో దీని ప్రభావం కనిపించింది. అరేబియా సముద్రంలో, ఆ రాజ్య సరిహద్దులకు సమీపంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. ఆ భూకంపానికి కారణం అరేబియా ప్లేట్ కదలిక అని, అది యురేషియన్ ప్లేట్‌తో ఢీకొనడం వల్ల అరేబియా గల్ఫ్ ప్రాంతంలోని తరచూ స్వల్ప స్థాయిలో భూకంపాలు వస్తుంటాయని నిపుణులు తెలిపారు.
ఇరాన్, ఇరాక్ మరియు ఒమన్ వంటి పొరుగు దేశాలలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. కొన్నిసార్లు వాటి ప్రభావం యూఏఈలో కనిపిస్తాయి. నవంబర్ 4న, ముసందమ్ దక్షిణాన 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎమిరేట్స్‌లో కూడా ప్రకంపనలను గమనించారు ప్రజలు.
తాజా వార్తలు
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్‌లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!







