రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ

- December 17, 2025 , by Maagulf
రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ

చెన్నై: తమిళనాడు రాష్ట్రప్రజలంతా రేపు విజయ్ భారీ ర్యాలీపై దృష్టిని నిలిపింది. కరూర్ తొక్కిసలాట ఘటన దేశాన్నే దిగ్భ్రాతికి గురిచేసింది.ఈ ఘటనలో 41మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. అప్పటి నుంచి టీవీకే అధినేత, నటుడు విజయ్ ప్రజల్లో పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. అయితే వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో తన పార్టీని బలోపేతం చేసుకునేందుకు విజయ్ యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భారీ ర్యాలీని నిర్వహించారు. గురువారం ఈరోడ్ జిల్లాలోని విజయమంగళం టోల్ గేట్ దగ్గర ప్రజలను ఉద్దేశించి విజయ్ ప్రసంగించనున్నారు. అయితే విజయ్ ర్యాలీ సందర్భంగా ఈరోడ్ లోని ఒక ప్రైవేట్ పాఠశాల సెలవు ప్రకటించింది. వార్షిక పరీక్షను కూడా వాయిదా వేసింది.

వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. సమయం దగ్గర పడడంతో రాష్ట్రవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే డిసెంబరు 18న ఈరోడ్ జిల్లాలో విజయ్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం టీవీకే నేతలు భారీ ఏర్పాటు చేస్తున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనలో 41మంది ప్రాణాలు కోల్పోయారు.అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన తర్వాత విజయ్ ర్యాలీలు, సభలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇటీవల పుదుచ్చేరిలో జరిగిన సభకు కూడా భారీ ఆంక్షలు విధించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com