ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!

- December 18, 2025 , by Maagulf
ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!

కువైట్: ముబారక్ అల్-కబీర్‌లోని పదుల సంఖ్యలో వాహనాలు, కిరాణా దుకాణాన్ని కువైట్ మునిసిపాలిటీ తొలగించింది. మున్సిపల్ నిబంధనలపై అవగాహన కల్పించడానికి  అన్ని గవర్నరేట్‌లలో ప్రత్యేక కార్యకమాలు నిర్వహిస్తున్నట్టు  తెలిపారు. 

ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ రూపాన్ని వక్రీకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో నిబంధనలు పాటించన 21 మందికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అదే సమయంలో  లైసెన్స్ లేని వాణిజ్య కంటైనర్లకు నోటీసులు అందించారు. ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య సేవలను మెరుగుపరిచే ప్రయత్నాలలో భాగంగా 46 పాత వ్యర్థ కంటైనర్లను కొత్త వాటితో రిప్లేస్ చేస్తామన్నారు. మున్సిపల్ నిబంధనలను అమలు చేయడానికి మరియు ప్రజా పరిశుభ్రతను నిర్వహించడానికి నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com