భారత్‌లో యాపిల్ డిమాండ్ ఎక్కువ
- July 27, 2016
అమెరికాకు చెందిన దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యాపిల్.. భారత్‌లో విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను భారత్‌లో విడుదల చేస్తూ వస్తున్న యాపిల్.. త్వరలోనే దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఈ విషయాన్ని యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వెల్లడించారు.
యాపిల్ వేగంగా విస్తరిస్తున్న మార్కెట్లలో భారత్ ఒకటని.. ఇక్కడ ఏటా ఐఫోన్ అమ్మకాలు 51 శాతం పెరుగుతూ వస్తున్నాయని కుక్ తెలిపారు. భారత్‌లో యాపిల్ డిమాండ్ ఎక్కువవుతుండటంతో రిటైల్ స్టోర్లను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే దీనిపై పూర్తి వివరాలను కుక్ వెల్లడించలేదు.
ఈ ఏడాది మే లో కుక్ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రధాని మోదీని కలిసిన కుక్.. రిటైల్ స్టోర్ల గురించి చర్చించారు. కుక్ పర్యటనలో భాగంగా మ్యాప్స్ డెవలప్‌మెంట్ కోసం హైదరాబాద్‌లో ఓ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది యాపిల్.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







