'ద పనామా పేపర్స్' పుస్తకం ఆధారంగా సినిమా..
- July 27, 2016
పనామా పేపర్స్ ద్వారా గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచ నల్లధనం కుబేరుల బాగోతం బట్టబయలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పనామా పేపర్స్ ఆధారంగా ఓ సినిమా రాబోతోంది.అమెరికన్ మల్టీనేషనల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయిన నెట్‌ఫ్లిక్స్.. జాన్వెల్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ పనామా పేపర్స్ సినిమాను తెరకెక్కించనున్నాయి. జర్మన్ పరిశోధనాత్మక జర్నలిస్టులు బాస్టియన్ ఒబర్మేయర్, ఫ్రెడ్రిక్ ఒబర్మయర్లు రాసిన 'ద పనామా పేపర్స్' పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇప్పటివరకు ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిందని ఇప్పుడు ప్రపంచాన్నే కుదిపేసిన పనామా పేపర్స్ సినిమా తెరకెక్కించనుందని జాన్ వెల్స్ నిర్మాణ సంస్థ రుడ్నిక్ పోల్స్టీన్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







