జులై 29న సమ్మెకు దిగనున్నా బ్యాంకులు

- July 27, 2016 , by Maagulf
జులై 29న  సమ్మెకు దిగనున్నా బ్యాంకులు

దేశంలోని బ్యాంకు యూనియన్లు జులై 29న శుక్రవారం సమ్మెకు దిగనున్నాయి. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ) మంగళవారం ప్రభుత్వ అధికారులతో చేపట్టిన చర్చలు విఫలమవ్వడంతో గతంలో సమ్మెకు పిలుపు ఇచ్చిన మాదిరిగానే శుక్రవారం ఒక్కరోజు సమ్మె చేయనున్నట్లు బ్యాంకు యూనియన్ల ఫోరం వెల్లడించింది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్‌(ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం కూడా జులై 29న సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు.
దీంతో దేశంలోని పబ్లిక్‌ రంగ బ్యాంకుల్లోని దాదాపు పది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులకు చెందిన 80వేల బ్యాంకు శాఖల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొననున్నారు. ప్రభుత్వం బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశపెడుతున్న కొన్ని పాలసీలను, సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com