రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- December 19, 2025
రియాద్: సౌదీ అరేబియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ను ప్రోత్సాహించేందుకు పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు. మార్కెట్ ధరల కంటే 84% వరకు రాయితీతో నివాస స్థలాలను రాయల్ కమిషన్ ఫర్ రియాద్ సిటీ అందిస్తుంది. రియాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను స్థిరీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నివాస స్థలాల కోసం ఒక ఎలక్ట్రానిక్ లాటరీని నిర్వహిస్తుంది. ఇందులో చదరపు మీటరుకు SR1,500 స్థిర ధరను ఆఫర్ చేసింది. మొత్తం 10,024 నివాస స్థలాలను అల్-ఖిరావాన్, అల్-మల్కా, అల్-నఖీల్, అల్-నార్జిస్, నమర్, అల్-రిమాయా, అల్-రిమాల్ మరియు అల్-జనాద్రియా ఏరియాల్లో కేటాయించారు. వీటి మొత్తం విస్తీర్ణం 6.38 మిలియన్ చదరపు మీటర్లు. ప్రతి ప్లాట్ 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది.
తాజా ప్రకటించిన ధరలు నిర్దేశిత పరిసర ప్రాంతాలలో ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే 16% నుండి 84% వరకు తక్కువకే వస్తున్నాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఇక ఈ ధరలు రియాద్ సగటు నివాస భూమి ధర కంటే 50% కంటే తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం మార్కెట్ లో సుమారుగా చదరపు మీటరుకు SR3,200గా ఉందని తెలిపారు. అల్-ఖిరావాన్లో అత్యధికంగా 84% రాయితీ నమోదైంది. ఆ తర్వాత అల్-మల్కా, అల్-నార్జిస్‌లో 78%, అల్-రిమాల్‌లో 58%, మరియు అల్-జనాద్రియాలో 16% రాయితీ లభించిందని వెల్లడించింది. ఈ కార్యక్రమం కింద, రాబోయే ఐదేళ్లలో ఏటా 10,000 నుండి 40,000 వరకు అభివృద్ధి చేసిన నివాస స్థలాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాయల్ కమిషన్ తెలిపింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







