రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- December 19, 2025
యూఏఈ: యూఏఈని కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం తెల్లవారుజామున రస్ అల్ ఖైమా ఎమిరేట్‌ను కుండపోత వర్షం ముంచెత్తడంతో ఒక భారత కార్మికుడు మరణించాడని అధికారులు తెలిపారు.
ఇరవై ఏళ్ల వయసున్న ఆ యువకుడు వర్షం తీవ్రమైనప్పుడు ఒక భవనంలో ఆశ్రయం పొందగా, అనుమానస్పద రీతిలో మరణించాడు. తన పేరు వెల్లడించడానికి ఇష్టపడని రస్ అల్ ఖైమా నివాసి ఒకరు మాట్లాడుతూ, ఆ యువకుడు ఇటీవల వివాహం చేసుకుని యూఏఈకి తిరిగి వచ్చాడని తెలిపారు. అల్ మమూరాలో తన పక్కనే ఉన్న దుకాణంలో అతను పని చేసేవాడని పేర్కొన్నాడు. ఆ యువకుడు ఒక షవర్మా దుకాణంలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడని అతను షవర్మా డెలివరీ చేయడానికి బయటకు వెళ్ళిన సమయంలో ప్రమాదానికి గురయ్యాడని తెలిపాడు. అయితే, ఆ యువకుడు ఎలా మరణించాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నాడు.
మిడిలీస్టుపై అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. యూఏఈలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి అనేక ఇళ్లు మరియు సంస్థలు నీట మునిగాయి. మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) అత్యంత ప్రభావిత ప్రాంతాలలోని ప్రైవేట్ రంగ కంపెనీలు శుక్రవారం రిమోట్ వర్క్‌కు అనుమతించాలని సూచించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. పార్కులు, బీచ్‌లను అధికారులు మూసివేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







